October 9, 2026
Explore
వాయల్పాడులో విప్లవ యోధుడు చేగువేరా వర్ధంతి కార్యక్రమం

వాయల్పాడులో విప్లవ యోధుడు చేగువేరా వర్ధంతి కార్యక్రమం

October 9, 2026 | Andhra Pradesh

వాయల్పాడు ముచ్చట్లు:

జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వాయల్పాడు పట్టణంలోని ఉర్దూ మైనారిటీ గురుకుల పాఠశాలలో విప్లవ యోధుడు చేగువేరా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన చేసిన పోరాటాలను స్మరించుకున్నారు.

చేగువేరా సమానత్వం, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని నిర్వాహకులు పేర్కొన్నారు. సమాజంలో శాస్త్రీయ దృక్పథం, మానవతా విలువలు పెంపొందించుకోవాలని, యువత సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags: Commemoration of Revolutionary Leader Che Guevara’s Death Anniversary in Vayalpadu