March 28, 2026
Explore
ఐపిఎల్‌ బెట్టింగ్‌లకు పాల్పడితే చర్యలు

ఐపిఎల్‌ బెట్టింగ్‌లకు పాల్పడితే చర్యలు

March 28, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

ఐపిఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ల బెట్టింగ్‌లకు ఎవరు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ సుబ్బరాయుడు హెచ్చరించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బెట్టింగ్‌ల మోజులో యువత లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై తమకు సమాచారం అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.

Tags: Action will be taken against those involved in IPL betting.