October 8, 2026
Explore
13 మద్యం దుకాణాలకు లాటరీలో లైసెన్సులు

13 మద్యం దుకాణాలకు లాటరీలో లైసెన్సులు

October 8, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లాలో పునరుద్ధరణకు నోచుకోని 17 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్‌ ఇవ్వగా, 13 దుకాణాలకు 78 దరఖాస్తులు వచ్చాయి. గురువారం మదనపల్లె కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాల్‌లో జాయింట్‌ కలెక్టర్‌ శివనారాయణ శర్మ ఆధ్వర్యంలో దరఖాస్తుదారుల సమక్షంలో పారదర్శకంగా లాటరీ నిర్వహించి లైసెన్సుదారులను ఎంపిక చేశారు.

ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల చొప్పున 78 దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.2.34 కోట్ల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. లాటరీలో ఎంపికైన వారు నిబంధనల ప్రకారం పన్నులు, రుసుములు చెల్లించిన అనంతరం లైసెన్సులు జారీ చేస్తామని పేర్కొన్నారు. దరఖాస్తులు రాని మిగిలిన నాలుగు దుకాణాలకు త్వరలో మరో నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో ఎక్సైజ్‌ అధికారులు, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags: Licenses for 13 liquor shops awarded via lottery