పుంగనూరుముచ్చట్లు:
పుంగనూరు సీపీఐ సీనియర్ నాయకుడు కామ్రేడ్ గండికోట చలిపతి(88) ఆదివారం కన్నుమూశారు. పేదలకు ఇళ్లస్థలాల కల్పన, భూ ఉధ్యమాలు, ఆర్టీసీ డిపో ఏర్పాటు, హంద్రనీవా సాధన కోసం ఆయన విశేషంగా కృషి చేశారు. 1995లో పుంగనూరు ఆర్టీసీ డిపో కోసం వారం రోజులు ఆమరణ నిరాహరదీక్ష చేపట్టారు. ఆయన మృతి పార్టీకి, పేద ప్రజలకు తీరనిలోటని సీపీఐ జాతీయ నేత డాక్టర్ కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య తదితరులు ఆయనకు సంతాపం తెలిపారు.
Tags: Senior CPI leader Gandikota Chalapathi passes away