October 8, 2026
Explore
రూ.1.16 కోట్లతో తారు రోడ్డు ప్రారంభం

రూ.1.16 కోట్లతో తారు రోడ్డు ప్రారంభం

October 8, 2026 | Andhra Pradesh

రైల్వేకోడూరు ముచ్చట్లు:

రైల్వేకోడూరు అనంతరాజుపేట పంచాయతీలోని తూర్పపల్లి ఎస్టీ కాలనీ వరకు రూ.1.16 కోట్లతో నిర్మించిన తారు రోడ్డును టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గురువారం ప్రారంభించారు. NABARD–RIDF పథకం కింద పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో రహదారిని నిర్మించారు. రోడ్డు సౌకర్యంతో కాలనీవాసుల చిరకాల రవాణా సమస్య పరిష్కారమైందని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.

Tags: Bitumen road worth Rs 1.16 crore inaugurated