October 8, 2026
Explore
సుండుపల్లి లో ఆటో–జేసీబీ ఢీకొని వ్యక్తి మృతి

సుండుపల్లి లో ఆటో–జేసీబీ ఢీకొని వ్యక్తి మృతి

October 8, 2026 | Andhra Pradesh

సుండుపల్లి ముచ్చట్లు:

సుండుపల్లి మండల కేంద్రంలోని అగ్రహారం వద్ద బుధవారం రాత్రి ఆటోను జేసీబీ ఢీకొన్న ప్రమాదంలో తిమ్మసముద్రం హరిజనవాడకు చెందిన మల్లేపల్లి మనోహర్‌ (55) మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. బలిజపల్లె రోడ్డు నుంచి పీలేరు రోడ్డుకు వస్తుండగా మలుపు వద్ద సుండుపల్లె వైపు వెళ్తున్న ఆటోను జేసీబీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మనోహర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించి రాయచోటి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటనతో తిమ్మసముద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Tags: Man dies after auto-rickshaw and JCB collide in Sundupalli.