అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లాలో రెన్యువల్ కాకుండా మిగిలిన 13 మద్యం దుకాణాలకు గురువారం లాటరీ పద్ధతిలో లైసెన్సులు కేటాయించనున్నారు. 17 దుకాణాలకు కొత్త లైసెన్సుల కోసం నోటిఫికేషన్ ఇవ్వగా, ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి వరకు 13 దుకాణాలకు 78 మంది దరఖాస్తుదారులు ఒక్కొక్కరు రూ.3 లక్షల చొప్పున దరఖాస్తు ఫీజు చెల్లించారు. నిబంధనల ప్రకారం ఒక్కో దుకాణానికి నాలుగు కంటే ఎక్కువ దరఖాస్తులు రావడంతో లాటరీ నిర్వహిస్తున్నారు. మదనపల్లె కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ఉదయం 8 గంటలకు కలెక్టర్ నిశాంత్ కుమార్ చేతుల మీదుగా లాటరీ తీస్తారు. దరఖాస్తుదారులు సమయానికి హాజరుకావాలని ఎక్సైజ్ డీపీఈవో మధుసూదన్, ఏఈఎస్ జోగేంద్ర కోరారు.
Tags: Lottery for 13 liquor shops today.