పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని బస్టాండ్ సమీపంలో గల శ్రీవిరూపాక్షి మారెమ్మ ఆలయంలో రానున్న దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఆలయప్రాకార గోపురాలను శుభ్రం చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరిచి అలంకరణ పనులు చేపట్టారు. నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు , అభిషేకాలతో పాటు ప్రత్యేక అలంకారాలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు మురళి తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండ అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్లు ఆయన తెలిపారు.

Tags: Maremma Temple gearing up for Navaratri.