October 7, 2026
Explore
చెరువులో చేపలు విడుదల

చెరువులో చేపలు విడుదల

October 7, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

దోమలవృద్ధిని నియంత్రించే దిశగా మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తిని అరికట్టేందుకు గంబూషియా చేపలను బుధవారం చెరువుల్లో విడుదల చేశారు. జిల్లా మలేరియా అధికారి ఆదేశాల మేరకు ఆయన అందించిన చేపలను పట్టణంలోని తూర్పుమొగసాలలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ జయంత్‌సాయి , సబ్‌ యూనిట్‌ అధికరి జి.గంగయ్య ఆధ్వర్యంలో పట్టణంలోని పుంగమ్మ చెరువు, పలమనేరు రోడ్డులోని సుబ్బమ్మ చెరువు, నక్కబండ చెరువుల్లో గంబూషియా చాపలను విడుదల చేశారు. ఈ చేపలు నీటిలోని దోమల లార్వాలను తినడం ద్వారా దోమలు వృద్ధిని తగ్గించడంలో దోహదపడుతుందని డాక్టర్‌ జయంత్‌సాయి తెలిపారు. పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూడటంతో పాటు దోమల నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆయన ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సోమశేఖరాచారు, షఫివుల్లా పాల్గొన్నారు.

Tags: Fish released into the tank