ఇబ్రహీంపట్నం ముచ్చట్లు:
రేషన్ మాఫియాలో D గ్యాంగ్ ప్రత్యేక పాత్ర పోషిస్తుంది…
మిగిలిన చిన్న చితకా వ్యాపారస్తులందరికీ చుక్కలు చూపిస్తున్న” D”గ్యాంగ్
ఇబ్రహీంపట్నం మండలాన్ని మొత్తాన్ని మాకే కావాలి అంటూ హుకుం జారీ చేసిన “” D “”గ్యాంగ్ అధినేత
అసలు ఎవరు ఈ D గ్యాంగ్ అధినేత
స్థానిక మీడియాను పోలీస్ అధికారులను తన గుప్పెట్లో పెట్టుకుని రేషన్ మాఫియాలో అంచలంచలుగా ఎదిగి ఇబ్రహీంపట్నం మండలాన్ని రూల్ చేస్తున్న ఆ కేటుగాడు ఎవరో తెలుసా మీకు…..
అటు రాజకీయ నాయకులు ఇటు పోలీసులు మరోపక్క రెవెన్యూ అధికారుల సపోర్టుతోనే రెచ్చిపోతున్న ” D ” గ్యాంగ్…
గతంలో పలుమార్లు ప్రధాన పత్రికల్లో కూడా ఈ ” D ” గ్యాంగ్ పై వార్త కథనాలు ప్రచురితమైన కూడా అటు పోలీస్ అధికారులు కానీ ఇటు రెవెన్యూ అధికారులు కానీ ఇప్పటివరకు స్పందించకుండా ఉండడం వెనక ఆంతర్యం ఏమిటో మరి…..
అసలు ఎవరు ఈ ” D “గ్యాంగ్ కి అధినేత అనేది ఇబ్రహీంపట్నం మండల వ్యాప్తంగా తెలిసినదే….
రేషన్ మాఫియాలో అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే లక్షలాది రూపాయలను నెలవారి అర్జిస్తూ లోకల్ గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మేనేజ్ చేస్తున్న ” D ” గ్యాంగ్ అధినేత…. మిస్టర్ ” D ” అసలు ఎవరు…
ఇబ్రహీంపట్నం మండలం వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క రేషన్ డీలర్ కూడా మాఫియాడాన్ మిస్టర్ ” D “తో సంబంధాలు ఏర్పరచుకొని పేదల పొట్ట కొట్టి ప్రతిరోజు టన్నుల కొలది రేషన్ బియ్యం బయటకి ఎలా పంపిస్తున్నారు
ఇబ్రహీంపట్నం మండల వ్యాప్తంగా సాగుతోంది రేషన్ పంపిణీ నా లేక దోపిడీనా…..
రేషన్ డీలర్లే దొంగలు అయితే మరి ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు….
రేషన్ మాఫియాకు కేంద్ర బిందువుగా మారిన రేషన్ డీలర్లు మాఫియా డాన్ ” D “తో కుమ్మక్కై పేదల పొట్ట కొడుతున్నారు అనేది ముమ్మాటికి నిజం…
ఎంతమంది రేషన్ డీలర్లు నిస్వార్ధంగా పేదలకు రేషన్ బియ్యాన్ని అందిస్తున్నారు ఎంతమంది వేలిముద్ర వేయించుకొని డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారు అని లిస్టు రేపటి కథనంలో ప్రత్యేకంగా గౌరవనీయులైనటువంటి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి చేరబోతోంది….
నెలవారి ఆదాయానికి అలవాటు పడి కక్కుర్తి పడి పేదల పొట్ట కొడుతున్న రేషన్ డీలర్లు వారికి కొమ్ము కాస్తున్న కొందరు అవినీతి అధికారులు ఆపై ” D “గ్యాంగ్…
మిస్టర్ డి యొక్క అసలు చరిత్ర ఏంటి…
ఎవడైనా సరే నా ముందు తల వంచాల్సిందే అటు పోలీస్ అయినా ఇటు రెవెన్యూ అయిన మీడియా అయినా అంటూ రెచ్చిపోతున్న అ ” D “గ్యాంగ్ అధినేత ..
నెలవారి మామూలు ఇస్తూనే ఉన్నా ను. మనల్ని ఆపేది ఎవడికి పారేయాల్సింది వాడికి పారేస్తున్నా ఎవడైనా సరే మనకి అడ్డొస్తే మన వెనక రాజకీయ నాయకులు ఉన్నారు అంటూ” D ” గ్యాంగ్ సభ్యులకు భరోసా ఇచ్చి మరి రేషన్ వ్యాపారాన్ని మూడు పూలు ఆరు కాయలుగా కొనసాగిస్తున్న మిస్టర్ ” D “
చెప్పేది శ్రీరంగా నీతులు దూరేది డాష్ గుడిసెలు అనే విధంగా తాను చేసేది తాను చేసేది మాత్రమే మంచి మిగతావారు చేసేదంతా కూడా రేషన్ వ్యాపారం అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్న మిస్టర్ ” D “
అనతి కాలంలోనే రేషన్ మాఫియా అని రూల్ చేస్తున్న ” D “యొక్క పూర్తి వివరాలు అతని గ్యాంగ్ యొక్క వివరాలు రేపటి కథనంలో మీ ముందుకు
Tags: The “D” gang ruling Ibrahimpatnam Mandal…