October 7, 2026
Explore
శ్రీ ఆగిస్తీశ్వర స్వామి సన్నిధి లో మోడీ కి ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసేన నాయకులు రాయల్ కుమార్

శ్రీ ఆగిస్తీశ్వర స్వామి సన్నిధి లో మోడీ కి ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసేన నాయకులు రాయల్ కుమార్

October 7, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

మన దేశ ప్రధానమంత్రి మోడీ గారి పేరు తో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాయల్ కుమార్

పుంగనూరు మండలం నెక్కుంది పంచాయతీ శ్రీ ఆగిస్తీశ్వర స్వామి ఆలయం లో మోడీ వారి రాజకీయ ప్రస్థానం లో 25 సంవత్సరాలు నిర్వీ రామంగా కృషి చేస్తూ ప్రపంచ దేశాలలో భారత దేశం కు ప్రత్యేక గుర్తింపు తీసుకు వచ్చిన ఏకైక నాయకుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అని జనసేన నాయకులు రాయల్ కుమార్ తెలిపారు. ఈ సందర్బంగా మోడీ వారి ఆయురారోగ్యాలతో ప్రజల కు సేవలు అందించేందుకు మరింత శక్తి ని ప్రసాదించాలని, వారు చేపట్టే ప్రతి పని లో మంచి జరగాలని కోరుకుంటూ శ్రీ ఆగిస్తీశ్వర స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.
మన దేసం ఆర్థిక మరియు సైనిక వ్యవస్థలో , మెకిన్ ఇండియా లాంటి మార్పులకు నాంది పలికిందని నాయకులు మన ప్రధాని అని గుర్తు చేశారు.పూజ కార్యక్రమం లో ఆలయ అర్చకులు మంజునాథ్ స్వామి,జనసేన సీనియర్ నాయకులు రాయల్ కుమార్ మనోజ్, నాన బాల ఉదయ్,వేణు రాయల్, జనసైనికులు, కూటమి నాయకులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

Tags; Janasena leader Royal Kumar performed special prayers for Modi at the Sri Agastheswara Swamy shrine.