వీరబల్లి ముచ్చట్లు:
మండలంలోని బీసీ కాలనీ సమీపంలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. రాయచోటికి ఇసుక తరలిస్తుండగా ట్రాక్టర్ ఎడమ వైపు టైరు ఊడిపోవడంతో అదుపుతప్పి రోడ్డుపై ఒరిగిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మండలంలో విచ్చలవిడిగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణాపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.
Tags; Sand tractor accident near Veeraballi BC Colony.