October 7, 2026
Explore
స్థానిక సంస్థల పాలన కార్యకర్తలతోనే

స్థానిక సంస్థల పాలన కార్యకర్తలతోనే

October 7, 2026 | Andhra Pradesh

  • ఎన్నికల్లో ఐకమత్యంగా పని చేయాలి
  • ఏకష్టం వచ్చిన అండగా ఉంటాం
  • బెదిరింపులకు , కేసులకు భయపడకండి
  • క్యాడర్‌కు మిధున్‌ బూస్ట్

పుంగనూరుముచ్చట్లు:

స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తల అభిప్రాయాల మేరకే అభ్యర్థుల ఎంపిక, పరిపాలన సాగిస్తామని, ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఐకమత్యంతో వైఎస్సార్‌సిపి అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని , కేసులకు, బెదిరింపులకు భయపడవద్దని , ప్రతి ఒక్కరికి తాను అండగా ఉంటానని రాజంపేట పార్లమెంటు సభ్యులు మిధున్‌రెడ్డి క్యాడర్‌కు బూస్ట్ అందించారు. సోమవారం సాయంత్రం మున్సిపాలిటి ఎన్నికలపై వార్డుల వారిగా అభ్యర్థుల ఎంపికకు కార్యకర్తలతో విడివిడిగా సమావేశం నిర్వహించారు. కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించారు. అలాగే పట్టణంలోని ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు బాలసుబ్రమణ్యంశెట్టి, ప్రముఖ వ్యాపారవేత్తలు రెడ్డిప్రసాద్‌, రవికుమార్‌, పిఎల్‌.శ్రీధర్‌ తదితరులతో సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో ఆర్యవైశ్యులు తమకు మద్దతు ఇచ్చి , వైఎస్సార్‌సిపి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ ప్రశాంతతకు నిలయమైన పుంగనూరులో స్వార్థపరులు అరాచకాలు, అక్రమాలు సాగిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వాటికి క్యాడర్‌ తగిన గుణపాఠం నేర్పేలా సిద్ధం కావాలన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చిన తాము ఇంటికి వచ్చి మద్దతు ఇస్తామని , ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు. వైఎస్సార్‌సిపి నాయకులకు, కార్యకర్తలకు కష్టాలు పెట్టాలని చూసిన సహించేది లేదన్నారు.

అభివృద్ధి ఎక్కడ…..

రెండేళ్ల తెలుగుదేశం ప్రభుత్వంలో పుంగనూరు అభివృద్ధికి ఒకరూపాయి అయిన ఖర్చు చేశారంటు ప్రభుత్వాన్ని ఎంపి నిలధీశారు. అక్రమ వ్యాపారాలు, భూకబ్జాలు, అక్రమ సంపాదనలతో కాలం గడిపేశారని ఎద్దెవ చేశారు. రానున్న ఎన్నికల కోసం తెలుగుదేశం ప్రభుత్వం మున్సిపాలిటిల్లో అభివృద్ధి చేసినట్లు గొప్పలు చెప్పుకొంటోందని ఆరోపించారు. రెండేళ్లుగా చేయని వారు ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నారని , ప్రజలు దీనిని గమనించి కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, సీమజిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌, వక్ఫ్బోర్డు మాజీ చైర్మన్‌ అమ్ము , పట్టణ అధ్యక్షుడు ఇర్ఫాన్‌, వైఎస్సార్‌సిపి నాయకులు సుబ్బన్న, ప్రశాంత్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, రాజేష్‌, యుగంధర్‌, నజీర్‌, సురేష్‌, అస్లాంమురాధి, హేము, జిమ్‌ ఇర్ఫాన్‌, నయాజ్‌, అయాజ్‌, ఆసిఫ్‌, అమ్ముకుట్టి, ఖాజా తదితరులు పాల్గొన్నారు.

Tags; Local body administration rests with the party workers.