October 7, 2026
Explore
పుంగనూరుకు కృష్ణాజలాలు ఇవ్వకపోతే పోరాటం

పుంగనూరుకు కృష్ణాజలాలు ఇవ్వకపోతే పోరాటం

October 7, 2026 | Andhra Pradesh

  • జగనన్న పాలనలో కృష్ణాజలంతో చెరువులు కళకళ
    -ఇప్పుడు నీళ్ళు ఉన్న ట్యాంకులకు చుక్కనీరు లేదు
  • ఎంపి మిధున్‌రెడ్డి ఆగ్రహం

పుంగనూరుముచ్చట్లు:

పుంగనూరు ప్రజలపై చంద్రబాబు ఎంతటి రాజకీయకక్ష సాధిస్తున్నారో మీరే ఒక్కసారి చూడండి. కృష్ణాజలాలు పుంగనూరు మీదుగా కుప్పంకు వెళ్తున్న , సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకుకు ఒక చుక్క నీరు కూడ లేక ఎండిపోతోంది. పట్టణ ప్రజలకు తాగునీరు అందించడంలో రాజకీయాలు చేస్తే సహించేది లేదు. పోరాటం చేసైన పుంగనూరుకు నీళ్లు తీసుకుంటాం. ఈ రాజకీయ కక్షలను ప్రజలు గమనించి తగిన గుణపాఠం నేర్పాలని రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి ప్రజలను కోరారు. సోమవారం సాయంత్రం ఆయన మాజీ ఎంపి రెడ్డెప్ప తో కలసి సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకు నీళ్లు లేకుండ ఎండిపోతున్న దృశ్యాలను విలేకరులకు చూపించారు. అలాగే పుంగనూరు మీదుగా కుప్పంకు పోలీస్‌ బందోబస్తుతో నీటిని తరలిస్తున్న దృశ్యాలను ఎంపి కాలువలో దిగి మీడియాకు వివరించారు. ఎంపి మాట్లాడుతూ పడమటి నియోజకవర్గమైన పుంగనూరు కరువు కోరల్లో చిద్రమై , నీరు లేక , పంటలు పండించలేక ఈ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడి జనం వలసలు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్‌సిపి ప్రభుత్వంలో రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోట్ల రూపాయలు ఖర్చు చేసి సమ్మర్‌స్టోరేజ్‌ట్యాంకు హెచ్‌ఎన్‌ఎస్‌ కాలువ పనులు పూర్తి చేయించి, హంద్రీనీవా నీటిని తొలి సారిగా విడుదల చేసి, సమ్మర్‌స్టోరేజ్‌ట్యాంకు ద్వారా పట్టణ ప్రజలకు తాగునీరు అందించడం జరిగిదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే కృష్ణాజలాలను హంద్రీనీవా కావలు గుండ కుప్పానికి తరలిస్తూ, పుంగనూరు ప్రజలకు నీటి సమస్య సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడుకు వ్యక్తిగత కక్షలతో పుంగనూరు అభివృద్ధిని అడ్డుకుని ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపించారు. పుంగనూరు , మదనపల్లె సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకులకు నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. నీటి కోసం పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్‌ అమ్ము, సీమజిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌, మాజీ ఎంపిపి భాస్కర్‌రెడ్డి, వైఎస్సార్‌సిపి రాష్ట్ర కార్యదర్శులు కొండవీటి నాగభూషణం, వెంకటరెడ్డి యాదవ్‌, పృద్వీధర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, జిల్లా యూత్‌వింగ్‌ కార్యదర్శి కొత్తపల్లె చెంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: Agitation if Krishna waters are not supplied to Punganur