October 7, 2026
Explore
తెలుగుదేశంలో ఇది మైనార్టీ నేతకు గౌరవం

తెలుగుదేశంలో ఇది మైనార్టీ నేతకు గౌరవం

October 7, 2026 | Andhra Pradesh

అయోపాపం…!

  • వైఎస్సార్‌సీపీలో ముఖ్య నేతల పక్కనే పెద్దపీట
  • పుంగనూరు మైనార్టీల్లో చర్చనీయాంశం

పుంగనూరుముచ్చట్లు:

సాధారణంగా ఎవరైనా పార్టీ మారితే కొత్తగా చేరిన పార్టీలో వెహోదటల్లో అత్యంత గౌరవం ఉంటుంది. తర్వాత తగ్గుతూ వచ్చి ప్రాధాన్యత కోల్పోతూ కార్యకర్త స్థాయికి గౌరవం పడిపోతుంది. ఈ పరిస్థితి పుంగనూరు ముస్లిం అంజుమన్‌ కమిటి కార్యదర్శి ఇబ్రహింకు అక్షరాల వర్తిస్తుంది. పుంగనూరు అంజునన్‌ కమిటి కార్యదర్శి ఎస్‌.ఇబ్రహింతో కలసి తెలుగుదేశం నాయకులు గత నెల 30న మున్సిపాలిటిలో పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఒక కూటమి నేత ఇంటిలో తెలుగుదేశం నూతన ఇన్‌చార్జ్ మధుసూదన్‌నాయుడుతో పాటు ఇబ్రహిం కూడ విందు భోజనానికి వెళ్లాడు. ఈ సమయంలో అందరు దర్జాగా డైనింగ్‌ టేబుల్‌పై కుర్చోని విందు భోజనం చేస్తూ , అంజుమన్‌ సెక్రటరీ ఇబ్రహిం ను మాత్రం నేలపై కుర్చోబెట్టి భోజనం పెట్టారు. ఈఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో ముస్లింలు మండిపడుతున్నారు. కాగా మాజీ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి మిధున్‌రెడ్డిలు పుంగనూరులో ఎప్పుడు ఎవరితో సమావేశాలు నిర్వహించిన అన్ని కులాలకు, మతాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి గౌరవించడం సాధారణమైంది. కానీ కూటమి నాయకులు ముస్లింలను అవమానించడం ఆందోళనలకు రేకేతీస్తోంది. పట్టణంలో ముస్లిం సంఘంలో అత్యంత విలువైనది అంజుమన్‌ కమిటి . అలాంటి కమిటికి కార్యదర్శిగా ఉన్న ఇబ్రహింను అవమానించడంపై ముస్లింల మనోభావాలు దెబ్బతీశారని , ముస్లింలకు కూటమి ప్రభుత్వంలో విలువ లేదని ఆరోపిస్తూ, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన ముస్లిం కుటుంభాలను కలవరపరుస్తోంది. మేదావి వర్గం సైతం ఇబ్రహింకు జరిగిన అవమానాన్ని ఖండిస్తున్నారు.

ముస్లింను అవమానించిన తెలుగుదేశం….

క్రమశిక్షణకు , నిజాయితి పనితీరుకు నిదర్శనంగా ఉన్న ముస్లిం కుటుంభాలను తెలుగుదేశం వారు అవమానించడం బాధకరమని ఎంపీ మిధున్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కల్లబొల్లి మాటలతో ముస్లిం ఓట్లను ఆకట్టుకునేందుకు తప్పుడు హామీలు ఇస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం పైన కుచోని ప్రగల్భాలు పలకడం కాదు. స్థానికంగా ముస్లింలు ఎంతో అవమానాలకు గురౌతున్నారో చూడాలి. ముస్లింలను అవమానించే వారెవరైన తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.

Tags: This is the respect accorded to a minority leader in the Telugu Desam.