October 7, 2026
Explore
జగనన్న నీటితో నింపారు – బాబు ఎండగట్టారు

జగనన్న నీటితో నింపారు – బాబు ఎండగట్టారు

October 7, 2026 | Andhra Pradesh

  • మేము ఏం పాపం చేశాం
  • మాకు నీరేందుకు ఇవ్వరు
  • జగనన్న పాలనలో నీటితో నిండిన ట్యాంకు
    -ఇప్పుడు కృష్ణాజలాలు ఉన్న ఎండిపోతున్న ట్యాంక్‌
  • నీటి కోసం పోరాడుతామన్న ఎంపి మిధున్‌

పుంగనూరుముచ్చట్లు:

పుంగనూరుపై చంద్రబాబు ఎంతటి రాజకీయకక్ష సాధిస్తున్నారో చెప్పేందుకు పుంగమ్మ సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకు ప్రత్యేక్ష సాక్ష్యం. పట్టణ ప్రజల దాహం తీర్చేందుకు జగనన్న పాలనలో కృష్ణాజలాలను తరలించి నిండుగా నింపారు. ప్రస్తుతం ఆకాలువలో కృష్ణాజలాలు ప్రవహిస్తున్న అవి నేరుగా చంద్రబాబు నియోజకవర్గం కుప్పానికి పోలీస్‌ బందోబస్తుతో తరలించుకుపోతున్నారు. ఫలితంగా సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకు చుక్కనీరు కూడ వదలలేదు. దీనిపై పట్టణ ప్రజలు చంద్రబాబుపై మండిపడుతున్నారు. సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకును సోమవారం పరిశీలించిన ఎంపి మిధున్‌రెడ్డి పట్టణ ప్రజలకు తాగునీరు ఇవ్వకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు.

పడమటి నియోజకవర్గమైన పుంగనూరు కరువు కోరల్లో చిద్రమై , నీరు లేక , పంటలు పండించలేక ఈ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడి జనం వలసలు వెళ్ళుతుండగా వైఎస్సార్‌సిపి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఒక్కసారిగా కరువుప్రాంతం సస్యశ్యామలమైంది. రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిల సొంత నియోజకవర్గాన్ని అన్నివిధాల అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టారు. వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసి సమ్మర్‌స్టోరేజ్‌ట్యాంకు, హెచ్‌ఎన్‌ఎస్‌ కాలువ పనులు పూర్తి చేయించి, హంద్రీనీవా నీటిని తొలి సారిగా సమ్మర్‌స్టోరేజ్‌ట్యాంకుకు తరలించి, పట్టణ ప్రజలకు తాగునీరు అందించారు. అలాగే పుంగమ్మ చెరువుకు , రాయల చెరువును నీటితో నింపి, రైతులకు సాగునీరు అందించారు. పట్టణంలో అతిపెద్ద చెరువులైన ఈరెండు నీటితో నిండితే రెండు సంవత్సరాల పాటు రైతుల పంటలకు సమృద్ధిగా నీరు అందుతుంది. అలాగే పట్టణ సమీపంలో భూగర్భజలాల మట్టం పెరిగి, నాడు మున్సిపాలిటి వాసులకు తాగునీటి సమస్య తీరింది. ప్రస్తుతం మున్సిపాలిటిలో నీటి సమస్య తీవ్ర మౌతోంది. ఎలినినో కారణంగా రాబోవు రోజుల్లో మరింత తీవ్రమైయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.

పుంగనూరు అభివృద్ధికి అడ్డు…..

చంద్రబాబునాయుడు వ్యక్తిగత కక్ష్యలతో మున్సిపాలిటిని అభివృద్ధి కాకుండ అడ్డుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పైగా వస్తున్న ఒక్క పైసా అభివృద్ధికి విడుదల చేయలేదు. ఎన్నికలకోసం డ్రామాలు ఆడుతున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉన్న , ప్రజలపై గౌరవం ఉన్న తక్షణమే హంద్రీనీవా నీటిని పుంగనూరు సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకుకు , పుంగమ్మ , రాయల చెరువులకు విడుదల చేయాలి. తాగునీరు కూడ ఇవ్వలేని ప్రభుత్వం ప్రజలకు ఏమి మేలు చేస్తోందో రానున్న స్థానిక ఎన్నికల్లో తేలిపోతుంది.

  • పివి.వెంకటమిధున్‌రెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు .

Tags:Jagananna filled it with water – Babu exposed the reality.