September 21, 2026
Explore
సీతారామపురం క్వారీ గుంతలో పడి ఇద్దరు బాలురు మృతి

సీతారామపురం క్వారీ గుంతలో పడి ఇద్దరు బాలురు మృతి

September 21, 2026 | Andhra Pradesh

పల్నాడు ముచ్చట్లు:

పిడుగురాళ్ల పట్టణ పరిధిలోని ఐదో వార్డు సీతారామపురం ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. క్వారీ గుంతలో పడి ఇద్దరు బాలురు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుల సతీష్ గౌతం ఇద్దరు అన్న తముళ్లు వయస్సు సుమారు 7, 12 సంవత్సరాలు ఉన్నట్లు సమాచారం.వివరాల్లోకి వెళితే.. కొండమోడు–సీతారామపురం–పులిచింతల ఆర్‌అండ్‌ఆర్‌ సెంటర్ సమీపంలోని గుడిసెల్లో నివాసం ఉంటున్న మార్కాపురం ప్రాంతానికి చెందిన ఇద్దరు బాలురు వినాయక చవితి నిమజ్జన కార్యక్రమానికి వచ్చినట్లు తెలిసింది. అనంతరం తమ పిన్ని, మరో బాలుడితో కలిసి బట్టలు ఉతకడానికి సమీపంలోని క్వారీ గుంతల వద్దకు వెళ్లారు.ఈ క్రమంలో క్వారీ గుంతలో నీరు ఉండటంతో దానిని లోతు తక్కువగా ఉన్న ప్రాంతంగా భావించిన ఇద్దరు బాలురు నీటిలోకి దూకినట్లు సమాచారం. దీంతో వారు గుంతలో మునిగిపోయారు. బాలురను కాపాడేందుకు వారి పిన్ని కూడా నీటిలోకి దూకగా, ఆమెతో ఉన్న మరో బాలుడు సైతం గుంతలోకి దిగినట్లు స్థానికులు తెలిపారు.
అదే సమయంలో అక్కడున్న ట్రాక్టర్ డ్రైవర్లు ఘటనను గమనించి వెంటనే స్పందించి బాలుర పిన్నితో పాటు మరో బాలుడిని బయటకు తీసుకువచ్చి కాపాడారు. అయితే గుంతలో మునిగిపోయిన ఇద్దరు బాలురను వెలికితీసి పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించగా, అప్పటికే వారు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
ఇద్దరు బాలుర మృతితో సీతారామపురం ఆర్‌అండ్‌ఆర్‌ సెంటర్, పరిసర గుడిసెల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags: Two boys die after falling into a quarry pit in Seetharamapuram.