September 21, 2026
Explore
24వ తేదీ వరకు తిరుపతిలో దర్శనం టోకెన్ల రద్దు

24వ తేదీ వరకు తిరుపతిలో దర్శనం టోకెన్ల రద్దు

September 21, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్లలలో శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీని టీటీడీ ఈనెల 24 వరకు నిలిపివేసింది. ఈనెల 25న దర్శనానికి సంబంధించిన టోకెన్లను 24న జారీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ముందస్తు సమాచారం లేకపోవడంతో ఆదివారం టోకెన్ల కోసం కేంద్రాలకు వచ్చి నిరాశ చెందిన భక్తులు నేరుగా తిరుమలకు బయలుదేరారు. భక్తులు ఈ మార్పును గమనించి తమ పర్యటనను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

Tags: Darshan tokens in Tirupati cancelled until the 24th.