September 21, 2026
Explore
ఏపీలో కరిగిపోయిన ఖరీఫ్!!

ఏపీలో కరిగిపోయిన ఖరీఫ్!!

September 21, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఏపీలో సూపర్ ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో ఖరీఫ్ పంటల సాగు గణనీయంగా తగ్గింది. సాధారణ విస్తీర్ణం కంటే 21.28 లక్షల ఎకరాల్లో సాగు నిలిచిపోగా, వరి, పత్తి, కంది, మిరప వంటి పంటలు ఎండల దెబ్బకు వాడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 497 మండలాల్లో లోటు వర్షపాతం, 125 మండలాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే, గత రెండు రోజులుగా కురిసిన వర్షాలు ఎండిపోతున్న ఉద్యాన తోటలకు, రైతులకు కొంత ఊరటనిచ్చాయి.

Tags: Kharif season washed away in AP!!