పుంగనూరుముచ్చట్లు:
పుంగనూరు నియోజకవర్గ జెఏసీ కార్యవర్గ సమావేశం శుక్రవారం సాయంత్రం విశ్రాంత ఉద్యోగుల భ వన్‌లో జిల్లా చైర్మన్ రాఘవులు ఆధ్వర్యంలో జరిగింది. సంఘ నియోజకవర్గ కార్యదర్శిగా బుడ్డన్నను ఎన్నుకున్నారు. అలాగే వైస్ చైర్మన్లుగా అయూబ్‌ఖాన్, జగన్నాథరాజు, సాహెబ్, శివకుమార్‌లు , జాయింట్ కన్వీనర్లుగా నరేంద్ర, మురళిబాబు, జ్ఞానతేజ, ట్రేజరర్‌గా శ్రీనివాసులును ఎన్నుకున్నారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ప్రసాద్‌బాబు, భాస్కర్‌రెడ్డిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ ప్రతినిధులను జెఏసీ ఉద్యోగులు పూలమాలలు వేసి సన్మానించారు. నూతన జెఏసీ చైర్మన్ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ , కార్మిక, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు కృషి చేస్తామని తెలిపారు. జెఏసీ సమస్యల పరిష్కారానికి అవసరమైతే పోరాటాలు చేస్తామని , జెఏసి సభ్యులందరికి అండగా ఉంటామని హామి ఇచ్చారు.
Tags: Rahmat Ali Khan Appointed as Constituency JAC Chairman