September 21, 2026
Explore
పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన

పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన

September 21, 2026 | Andhra Pradesh

పిఠాపురం ముచ్చట్లు:

•ఫకృద్ధీన్ పాలెంలో సుందరీకరించిన మైసమ్మ చెరువును ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి

•ఉప ముఖ్యమంత్రివర్యుల చొరవతో మారుతున్న గ్రామీణ ప్రాంత చెరువుల రూపురేఖలు

•పిఠాపురం నియోజకవర్గంలో రూ. 6 కోట్లతో 11 చెరువుల సుందరీకరణ

కాకినాడ | పిఠాపురం నియోజకవర్గంలోని ఫకృద్ధీన్ పాలెం గ్రామంలో రూ. 73 లక్షల వ్యయంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన మైసమ్మ చెరువు, వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్కును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో చెరువులను కేవలం నీటి వనరులుగానే కాకుండా ప్రజలకు ఆహ్లాదం, ఆరోగ్యం అందించే సామాజిక వేదికలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో మైసమ్మ చెరువును నమూనాగా అభివృద్ధి చేశారు.

పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా సోమవారం మైసమ్మ చెరువును సందర్శించిన పవన్ కళ్యాణ్ గారు వాకింగ్ ట్రాక్, ఓపెన్ ఎయిర్ జిమ్‌తోపాటు పిల్లల పార్కును ప్రారంభించారు. అలాగే నియోజకవర్గవ్యాప్తంగా అభివృద్ధి చేసిన మరో 11 చెరువులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కాకినాడ జిల్లా పరిధిలో అభివృద్ధి చేసిన 14 చెరువులకి సంబంధ

Tags:Deputy Chief Minister Pawan Kalyan’s visit to Pithapuram.