మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లె వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన గ్యాంబ్లింగ్ కేసులో ఐదుగురు ముద్దాయిలకు 10 రోజుల జైలు శిక్ష విధించారు. క్రైం నంబర్ 174/2026 U/s 9(1) గేమింగ్ యాక్ట్ కింద పెండ్లిల్ల లక్ష్మీనారాయణ, తలారి నరసింహులు, కత్తి రామచంద్ర, ఇల్లూరి బావాజాన్, షేక్ మహబూబ్ బాషాలను పోలీసులు పట్టుకున్నారు. సోమవారం స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రమేష్ బాబు ఎదుట హాజరుపరచగా శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు.
Tags: Five sentenced to prison in gambling case