September 21, 2026
Explore
ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అత్యున్నత ప్రాధాన్యత.

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అత్యున్నత ప్రాధాన్యత.

September 21, 2026 | Andhra Pradesh

  • PGRS కార్యక్రమంలో 60 ఫిర్యాదులు స్వీకరణ.
  • ఫిర్యాదులను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని ఎస్పీ ఆదేశాలు.
  • బాధితులకు సత్వర, పారదర్శక న్యాయం అందించడమే పోలీస్ శాఖ లక్ష్యం.
  • ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం, నిర్లక్ష్యానికి తావులేదని స్పష్టం.

తిరుపతి ముచ్చట్లు:

జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక *(PGRS) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 60 ఫిర్యాదులు స్వీకరించారు.

జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీలు ఏ. శ్రీనివాసులు (పరిపాలన), శ్రీలత (మహిళా పోలీస్ స్టేషన్) ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని, ఫిర్యాదుల వివరాలను నమోదు చేసుకున్నారు.

అందిన ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులు చట్టపరిధిలో నిష్పాక్షికంగా, సమగ్రంగా విచారించి నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. అర్హులైన బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం లేదా నిర్లక్ష్యానికి తావులేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

ప్రజల సమస్యలను సానుకూలంగా స్వీకరించి, చట్టపరమైన పరిధిలో వేగంగా, పారదర్శకంగా, నిష్పాక్షికంగా పరిష్కరించడం ద్వారా ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసాన్ని మరింత పెంపొందించడమే లక్ష్యమని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, పేర్కొన్నారు.

Tags: Top priority is accorded to the redressal of public grievances.