September 21, 2026
Explore
వీధి పశువులకు ఆశ్రయాల నిర్మాణంపై సుప్రీంకోర్టుకు NHAI

వీధి పశువులకు ఆశ్రయాల నిర్మాణంపై సుప్రీంకోర్టుకు NHAI

September 21, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

జాతీయ రహదారులపై వీధి పశువుల కోసం ఆశ్రయాలు నిర్మించాలన్న గత ఆదేశాలను సవాలు చేస్తూ NHAI దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. ఈ షెల్టర్ల నిర్మాణంతో రూ.7,000 కోట్ల భారీ ఆర్థిక భారం పడుతుందని సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. ఈ బాధ్యత స్థానిక సంస్థలదేనని స్పష్టం చేయడంతో సీజేఐ ధర్మాసనం సానుకూలంగా స్పందించింది.

Tags: NHAI approaches Supreme Court regarding construction of shelters for stray animals.