లక్కిరెడ్డిపల్లి ముచ్చట్లు:
లక్కిరెడ్డిపల్లి మండలం దొర్రిచెరువుల్లో వినాయక నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు నిమజ్జనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 13వినాయక విగ్రహాలకు నిమజ్జనం జరిగినట్లు ఎస్‌ఐ శోభ తెలిపారు. భక్తులు, యువత ఉత్సాహంగా నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విగ్రహాలను నిమజ్జనం చేశారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పర్యవేక్షించారు.
Tags: Immersion of 13 Vinayaka idols in Dorri Cheruvu