September 20, 2026
Explore
హార్స్లీ హిల్స్ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

హార్స్లీ హిల్స్ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

September 20, 2026 | Andhra Pradesh

బి.కొత్తకోట ముచ్చట్లు:

హార్స్లీ హిల్స్ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం లయన్ మోహన్ రెడ్డి నివాసంలో ఘనంగా నిర్వహించారు.

2026–2027 సంవత్సరానికి అధ్యక్షుడిగా లయన్ జె. యశ్వంత్, కార్యదర్శిగా లయన్ ఈ. మనోజ్ కుమార్ రెడ్డి, కోశాధికారిగా లయన్ మారిమిరెడ్డి ప్రశాంత్ (దేవరాసిపల్లి) బాధ్యతలు స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో గ్లోబల్ లీడర్‌షిప్ టీమ్ సభ్యులు లయన్ కె. మోహన్ రెడ్డి, అదనపు జిల్లా క్యాబినెట్ కార్యదర్శి లయన్ రామచంద్ర రెడ్డి, రీజియన్ చైర్‌పర్సన్ లయన్ పి. సోమయ్య పాల్గొన్నారు.

సేవా కార్యక్రమాల్లో భాగంగా ఐఐటీ వారణాసిలో ప్రవేశం పొందిన షెడ్యూల్డ్ కాస్ట్ విద్యార్థిని టి. నవదీపిక (తండ్రి: టి. రమేష్, నమలపల్లి)కు రూ.20,000 స్కాలర్‌షిప్ చెక్కును అందజేశారు.

కార్యక్రమంలో లయన్ దేశు రఘునందన్, లయన్ జి. రామచంద్ర రెడ్డి, నూతన సభ్యులు లయన్ బి. శివ రెడ్డి, లయన్ నవాజ్ బాషా, ఎం.టెక్ నరేష్, ఆనంద్, వంశీ, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో విద్య, వైద్యం, సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.

Tags: Swearing-in of the New Executive Committee of Horsley Hills Lions Club