September 20, 2026
Explore
నాయుని భావి వద్ద యువరైతు దారుణ హత్య

నాయుని భావి వద్ద యువరైతు దారుణ హత్య

September 20, 2026 | Andhra Pradesh

కొత్తకోటముచ్చట్లు:

బి.కొత్తకోట నాయనబావికి చెందిన యువ రైతు గంగిరెడ్డి గారి గోపాల్ రెడ్డి(40) దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం బోరు వద్ద ఒంటరిగా ఉన్న అతడిని ప్రత్యర్థులు కాళ్లుచేతులు కట్టేసి, పొదల చాటుకు లాక్కెల్లి ఇనపరాడ్లు, బండరాళ్లతో కొట్టి చంపారు. కుటుంబీకులు ఆలస్యంగా గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీఐ గోపాల్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Young farmer brutally murdered near Nayuni’s well.