పుంగనూరు
పట్టణంలోని కోనేరు ప్రహారీని శనివారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ప్రహారీ ఒక వైపు దెబ్బతింది. చారిత్రక ఆనవాళ్లలో ఒకటైన కోనేరు ప్రహారీగోడ దెబ్బతినడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించి , బాద్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


Tags: Damaged compound wall of the temple tank