September 20, 2026
Explore
కంటి వైద్యశిబిరానికి అపూర్వ స్పందన

కంటి వైద్యశిబిరానికి అపూర్వ స్పందన

September 20, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని చదళ్ల గ్రామంలో డాక్టర్‌ ఏపిజె అబ్దుల్‌కలాంహెల్త్ ఎడ్యూకేషనల్‌ చారిటబుల్‌ ట్రస్ట్చే నిర్వహించిన ఉచిత కంటి వైద్యశిబిరానికి అపూర్వ స్పందన లభించింది. ఆదివారం ట్రస్ట్ వ్యవస్థాపకుడు అయూబ్‌ఖాన్‌ ఆధ్వర్యంలో కుప్పం పీఈఎస్‌ హస్పిటల్‌ వైద్యులచే ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి చికిత్సలు నిర్వహించారు. 100 మందికి చికిత్సలు చేసి 15 మందికి ఆపరేషన్లు ఉచితంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజారెడ్డి, నరసింహులు, శివకుమార్‌, అమర్‌నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags: Unprecedented response to eye camp