పుంగనూరు ముచ్చట్లు:
వినాయక చవితిని పురస్కరించుకుని పట్టణంలో ఏర్పాటు చేసిన గణనాథుని ప్రతిమలను ఆదివారం యువకులు ఉల్లాసంగా….ఉత్సాహంగా నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పోలీస్‌లైన్, ఎంబిటి రోడ్డు, జేన్యూటౌన్, యాబైరాళ్ల, ప్రెండ్స్ఫంక్షన్‌హాల్ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన గణనాథుని విగ్రహాలను బళ్ళారిడ్రమ్స్ వాయిద్యాలు, టపాసులు పేలుళ్ల నడుమ ఊరేగిస్తూ యువకులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ , కేరింతలు కొడుతూ జై భలో గణేష్ మహరాజ్‌కి జై అంటు నినాదాలు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ నిమజ్జనానికి తరలించారు.
Tags: Enthusiastic immersion of Lord Ganesha