కాకినాడ ముచ్చట్లు:
పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగ యువత మంత్రి నారా లోకేష్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు.
ఏళ్లుగా పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు మరిన్ని అవకాశాలు కల్పించాలని మంత్రి నారా లోకేష్ ను కోరారు.
ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ ఉంటుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వరుసగా భర్తీ చేస్తున్నామని నారా లోకేష్ పేర్కొన్నారు.
పోలీస్ పోస్టుల పెంపు విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని చర్చిస్తామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు.
Tags;Minister Nara Lokesh stated that job recruitment will take place annually in accordance with the job calendar.