September 19, 2026
Explore
ఐటిఐలో ప్రవేశాలకు ధరఖాస్తులు

ఐటిఐలో ప్రవేశాలకు ధరఖాస్తులు

September 19, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని ప్రభుత్వ ఐటిఐలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఆరోదశ ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ సురేష్‌ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సివిల్‌, డీజల్‌ మెకానిక్‌ కోర్సులతో పాటు మహిళలకు ఫ్యాషన్‌డిజైనింగ్‌ అండ్‌ టెక్నాలజి కోర్సుల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 22లోగా ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Tags: Applications for admission to ITI