పుంగనూరు ముచ్చట్లు:
పెరటాసి మాసం మొదటి శనివారం సందర్భంగా పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ అర్చకులు శ్రీవారి మూలవిరాట్‌కు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవమూర్తులను అలంకరించి అద్దాల మండపంలో భక్తుల దర్శనార్థం కొలువుదీర్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
Tags: Prayers offered to Sri Kalyana Venkanna