September 19, 2026
Explore
చిట్రెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

చిట్రెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

September 19, 2026 | Andhra Pradesh

ఎదురెదురుగా ఢీకొన్న ద్విచక్ర వాహనాలు.. ఇద్దరు దుర్మరణం

చౌడేపల్లి ముచ్చట్లు;

అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం పలమనేరు రహదారిలోని చిట్రెడ్డిపల్లి వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మృతుల్లో చౌడేపల్లి కుమ్మరవీధికి చెందిన మహేష్ (వెంకటరమణ కుమారుడు), గంగాభవాని కురపల్లికి చెందిన డి.సంతోష్ ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

Tags: Horrific road accident at Chitreddypalli