పుంగనూరుముచ్చట్లు:
మున్సిపాలిటిలో కాలువల్లో మట్టి, మురుగునీటి తొలగింపు, వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాల కోసం జెసిబి వాహనాన్ని రూ.33 లక్షలతో కొనుగోలు చేసినట్లు కమిషనర్ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ స్వచ్చాంధ్ర కార్పోరేషన్ నిధులతో జెసిబిని రూ.33 లక్షలతో కొనుగోలు చేశామన్నారు. మున్సిపాలిటిలో పనుల నిమిత్తం అద్దె వాహనాలను వినియోగిస్తున్నామని, దీని ద్వారా అధిక వ్యయం జరుగుతోందన్నారు. దీనిని తగ్గించేందుకు మున్సిపాలిటికి జెసిబిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. దీనికి సిబ్బందిని నియమించి, వాహనాన్ని పనులకు వినియోగిస్తామన్నారు.
Tags: JCB purchased for the municipality for Rs 33 lakh.