September 18, 2026
Explore
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ

September 18, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న సంఘటన గురువారం రాత్రి మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు. మండలంలోని గుడిసెబండకు చెందిన గంగాధర్‌(32), రెడ్డెప్ప (30) లు ద్విచక్రవాహనంలో పుంగనూరు నుంచి ఊరికి వెళ్తుండగా మార్గ మధ్యంలోని గుడిసెబండ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు గాయపడ్డారు. దీనిని గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించి , స్థానిక ఏరియా ఆసుపత్రిలో చికిత్సలు చేయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Lorry rams into two-wheeler.