కోలార్ ముచ్చట్లు:
ప్రమాద ఘటనలో ద్విచక్ర వాహన దారుడు మృతి.
కోలారు జిల్లా శ్రీనివాసపుర తాలూకా తూపల్లి గ్రామం సమీపంలో ప్రమాదం.
మృతుడు ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెకు చెందిన షమీర్ (22) గా గుర్తింపు.
షమీర్ తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని గమనించకుండా వెనుక నుండి వేగంగా ఢీకొట్టినట్లు తెలుస్తోంది.
ఢీకొన్న తీవ్రతకు తీవ్ర గాయాలైన షమీర్ అక్కడికక్కడే మృతి
సమాచారం అందుకున్న రాయల్పాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన.
ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలింపు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని తదుపరి దర్యాప్తు చేపట్టారు.
Tags: Two-wheeler crashes into a stationary lorry.