పుంగనూరుముచ్చట్లు:
డాక్టర్ బిఆర్.అంబేద్కర్‌పై హమారప్రసాద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్చహించారు. అశోక్ మాట్లాడుతూ అంబేద్కర్‌ను అవమానించడం అంటే రాజ్యాంగాన్ని అవమానించడమేనన్నారు. దేశంలోని అన్ని వర్గాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగాన్ని రూపొందించిన మహానేతపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అలాంటి వ్యక్తిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో డాక్టర్ బిఆర్.అంబేద్కర్, రాజ్యాంగం మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే తాటతీస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు రియాజ్, పరమేష్, సమివుల్లా, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Tags: A case should be registered against Hamara Prasad.