తలపుల సచివాలయంలో పీజీఆర్‌ఎస్, పెన్షన్లపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్
తలపుల ముచ్చట్లు:
శుక్రవారం తలపుల సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆకస్మికంగా సందర్శించి సచివాలయ సేవలపై సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులను పీజీఆర్‌ఎస్‌లో నాణ్యతతో సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు.
ఒకసారి పరిష్కరించిన ఫిర్యాదులు మళ్లీ రీ-ఓపెన్ అయ్యే పరిస్థితి రాకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. ప్రజల ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా నిర్ణీత సమయంలో పరిష్కరించాలని స్పష్టం చేశారు.
పెన్షన్లకు సంబంధించిన ప్రొబేషనరీ వెరిఫికేషన్‌ను వేగవంతంగా, క్షుణ్ణంగా పూర్తి చేయాలని, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రజలకు అందించే ప్రతి ప్రభుత్వ సేవలో జాప్యం లేకుండా, పారదర్శకతతో పనిచేయాలని, పెండింగ్ కేసులు లేకుండా సచివాలయ స్థాయిలోనే సమస్యలను పరిష్కరించేలా అధికారులు, సిబ్బంది బాధ్యతతో పనిచేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ సూచించారు.
Tags; Priority must be given to quality in resolving public issues.