September 18, 2026
Explore
మొబైల్ ఫోరెన్సిక్ వాహనం ప్రారంభం

మొబైల్ ఫోరెన్సిక్ వాహనం ప్రారంభం

September 18, 2026 | Andhra Pradesh

అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:

నేర దర్యాప్తు కోసం అత్యాధునిక మొబైల్ ఫోరెన్సిక్ వాహనం అన్నమయ్య జిల్లాకు చేరుకుంది. డీజీపీ మంజూరు చేసిన ఈ వాహనాన్ని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి గురువారం మదనపల్లెలో ప్రారంభించి క్లూస్ టీమ్ ఇన్‌ఛార్జి సునీల్‌కు అప్ప గించారు. ఇందులో 10 రకాల కిట్లు, హై-ఇంటెన్సిటీ లైట్, డీఎన్ఏ పరికరాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. నేరస్తులు సాక్ష్యాలు మాయం చేసినా గుర్తించి కఠిన శిక్షలు పడేలా చేస్తామని ఎస్పీ ధరజ్ ఈ సందర్బంగా హెచ్చరించారు.

Tags: Mobile forensic vehicle launched