September 18, 2026
Explore
డ్వాక్రా మహిళలకు’ కూటమి ప్రభుత్వం భరోసా..!

డ్వాక్రా మహిళలకు’ కూటమి ప్రభుత్వం భరోసా..!

September 18, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,02,009 స్వయం సహాయక సంఘాలకు రూ.15,054 కోట్ల బ్యాంకు రుణాలు అందించాం.

స్త్రీనిధి ద్వారా 4.73 లక్షల మంది మహిళలకు రూ.4,800 కోట్ల రుణాలు పంపిణీ చేసినట్లు మంత్రి ప్రకటన.

ప్రతి ఎస్‌హెచ్‌జీ మహిళకు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, సురక్షా బీమా యోజనల ద్వారా రక్షణ కల్పించాలని ఆదేశాలు.

మహిళలు తయారు చేసే 65 రకాల ఉత్పత్తుల విక్రయానికి 4 స్వయం (SWAYAM) బ్రాండ్ సిగ్నేచర్ స్టోర్ల ఏర్పాటుకు చర్యలు.

అన్ని జిల్లాల్లో శిక్షణ కేంద్రాల ఏర్పాటు.. లాండ్రీ, బ్యూటీ పార్లర్, హెయిర్ కటింగ్ వంటి వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ.

డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం.

Tags; Alliance government assures DWCRA women!