September 17, 2026
Explore
హిందీబాష ఎంతో అవసరం

హిందీబాష ఎంతో అవసరం

September 17, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

విద్యార్థులు తెలుగు, ఇంగ్లీష్ తో పాటు హిందీ బాషను కూడ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని హెచ్‌ఎం రుద్రాణి తెలిపారు. గురువారం స్థానిక జెడ్పి బాలికల హైస్కూల్‌లో హిందీబాషా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం మాట్లాడుతూ పలు రాష్ట్రాలు, దేశాలలో కూడ హిందీబాష వాడుకలో ఉందన్నారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి, స్థిరపడాలనుకునే వారికి హిందీబాష ఎంతో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులు అన్ని బాషలను నేర్చుకోవడం ఎంతో ఉత్తమమం అని ప్రతిబాష ఒక సమయంలో ఉపయోగపడుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తనుజ , రెడ్డిరాజేశ్వరి, జీవలత, జివి.రమణ, నాయక్‌, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: The Hindi language is very important.