శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగముగా గరుడ వాహన సేవ సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ పటిష్ట భద్రతా చర్యలతో పాటు బందోబస్తు.
జిల్లా యంత్రాంగం, టిటిడి, విజిలెన్స్వి, RTC మరియు ఇతర విభాగాలతో ఖచ్చితమైన సమన్వయంతో అన్ని భద్రతా ఏర్పాట్లు.
తిరుపతి ముచ్చట్లు:
- తిరుపతి నగరంలో భక్తుల మరియు వాహనదారుల సౌలభ్యం నిమిత్తం ట్రాఫిక్ మళ్లింపులు, ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు.
- ప్రైవేటు వాహనాల పైన ఆంక్షలు, భక్తులకు ఇబ్బంది లేకుండా RTC బస్సులు మరియు TTD వాహనాల ద్వారా తిరుమల కు చేరుకొనేలా ఏర్పాట్లు.
- భక్తులు ప్రవేటు వాహనాలలో కాకుండా RTC బస్సులలో తిరుమల కి రావాలని సూచన.
- ప్రైవేటు వాహనాల పార్కింగ్ కు ప్రత్యేక స్థలాల కేటాయింపు, పార్కింగ్ ప్రదేశం నుండి భక్తులు తిరుమల కు చేరే విధంగా RTC వారి సహకారం తో ప్రత్యేక ఏర్పాట్లు.
- దూర ప్రాతం నుండి వచ్చే వారికి పార్కింగ్ ప్రదేశం పైన అవగాహన్ నిమిత్తం సోషియల్ మీడియా ద్వారా ను మరియు ఫ్లెక్సీ ల ద్వారా పార్కింగ్ QR కోడ్ తో కూడిన సమాచారం.
- గరుడ సేవ నాడు భక్తుల యొక్క భద్రత ప్రథమ ధ్యేయంగా తిరుమల-తిరుపతి ఘాట్ రోడ్ లో ద్విచక్ర వాహనాల నిలిపివేత.
- ద్విచక్ర వాహన దారులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక పార్కింగ్ సదుపాయం తో పాటు 24X7 గంటల పాటు RTC బస్సుల ద్వారా తిరుమల చేరే విధంగా ఏర్పాట్లు.
- అంబులెన్స్, ఫైర్ సర్వీస్ మరియు ఇతర ఎమెర్జెన్సీ వాహనాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు.
- నిబంధనలు పాటించి గరుడ సేవ విజయవంతం చేయడంలో భక్తులు సహకరించవలసిందిగా జిల్లా ఎస్పీ విజ్ఞప్తి.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన గరుడ వాహన సేవ 19-09-2026న తిరుమలలో నిర్వహించనున్న నేపథ్యంలో, లక్షలాది మంది భక్తులు తిరుపతి నగరానికి చేరుకునే అవకాశం ఉన్నందున భక్తుల రాకపోకలు సజావుగా సాగేందుకు, ట్రాఫిక్ నియంత్రణకు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ యల్.సుబ్బరాయుడు, తెలిపారు.
గరుడ వాహన సేవను దర్శించేందుకు తిరుపతికి వచ్చే భక్తులు తమ వాహనాలను కేటాయించిన పార్కింగ్ ప్రాంతాల్లో మాత్రమే నిలిపి ఉంచాలని, ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ పోలీస్ శాఖకు సహకరించాలి. భక్తులు మరియు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను అనగా RTC బస్సులు మరియు టిటిడి వాహనాలను వినియోగించి పోలీస్ వారికి సహకరించాలని కోరడమైనది.
- ద్విచక్ర వాహనాలు శుక్రవారం అనగా 18.09.2026 వ తేది రాత్రి 9 గంటల నుండి ఆదివారం అనగా 20.09.2026 ఉదయం 6 గంటల వరకు తిరుమల-తిరుపతి ఘాట్ రోడ్డు లో అనుమతి లేదు.
- ద్విచక్ర వాహనదారులకు అసౌకర్యం కలగకుండా పార్కింగ్ సదుపాయం ఈ క్రింది ప్రదేశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. 1. బాలాజీ లింక్ బస్తాండ్, 2. నెహ్రు మున్సిపల్ గ్రౌండ్, 3. యస్.వి మెడికల్ కాలేజి గ్రౌండ్, 4. ఇష్కాన్ గ్రౌండ్.
- టూరిస్టు బస్సులకు వివధ రూట్ లలో వచ్చు వారికి అనుగుణంగా జూ పార్క్ రోడ్డు లోని దేవలోక్, TRIDENT, మ్యాంగో మార్కెట్ నందు పార్కిండ్ సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది.
- ఫోర్ వీలర్ వాహనాలకు భారతీయ విద్యాభవన్, అలిపిరి లింక్ బస్టాండు, యస్.వి మెడికల్ కాలేజి గ్రౌండ్, యస్.వి ఇంజనీరింగ్ కాలేజి గ్రౌండ్ లలో పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది.
- పైన వున్న అన్ని పార్కింగ్ స్థలాల వద్ద టిటిడి వారి ద్వారా కావలసిన అన్ని ఏర్పాట్లతో పాటు తిరుమల కు చేర్చే విధంగా RTC బస్సుల ఏర్పాటు.
గరుడ సేవ నాడు తిరుపతికి వివిధ ప్రదేశాల నుండి వచ్చు బస్సులను ఈ క్రింది విధంగా ట్రాఫిక్ డైవర్ట్ చేయడం జరిగింది.
- చిత్తూరు-మదనపల్లి వైపు నుండి వచ్చు బస్సులు కాలురు క్రాస్ మీదుగా అర్.సి.పురం జంక్షన్, తనపల్లి జంక్షన్ మీదుగా గరుడ ఫ్లై ఓవర్ ద్వారా RTC బస్టాండ్ వైపు కి మళ్లింపు.
- చెన్నై మరియు పుత్తూరు వైపు నుండి వచ్చే బస్సులు సింధు ఫ్లై ఓవర్, తనపల్లి జంక్షన్ మీదుగా గరుడ ఫ్లై ఓవర్ ద్వారా RTC బస్టాండ్ వైపు కి మళ్లింపు.
- కడప మరియు శ్రీకాళహస్తి వైపు నుండి తిరుపతి కి వచ్చే బస్సులు రమణ విలాస్ జంక్షన్, గాజులమండ్యం సిర్కిల్ మీదుగా సింధు ఫ్లై ఓవర్, తనపల్లి జంక్షన్ మీదుగా గరుడ ఫ్లై ఓవర్ ద్వారా RTC బస్టాండ్ వైపు కి మళ్లింపు.
భక్తుల భద్రత తో పాటు వాహన దారుల యొక్క సౌలభ్యం కోసం అమలు చేస్తున్న ట్రాఫిక్ నిబంధనలు, సూచనలు, మళ్లింపులు పాటించి గరుడ సేవ విజయవంతం కోసం సహకరించవల సిందిగా కోరడమైనది.
Tags: Lord’s Salakatla Brahmotsavams