పుంగనూరుముచ్చట్లు:
మండలంలోని రైతులకు రాయితీపై ఉలవ విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు ఏవో రాధ తెలిపారు. గురువారం ఆమె ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. మండలానికి కేటాయించిన 460 క్వింటాళ్ల ఉలవలను ఆయా రైతు సేవా కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు. రైతులు తమ ఆధార్, పాసుపుస్తకం పెట్టి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని , ఉలవలు పొందాలని కోరారు.
Tags: Distribution of horse gram at a subsidized rate