September 17, 2026
Explore
భర్త ఆత్మహత్యాయత్నం

భర్త ఆత్మహత్యాయత్నం

September 17, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

భార్య భర్తల విబేదాలతో భర్త పెట్రోల్‌ పోసుకుని కోర్టు ముందు గల బైపాస్‌ రోడ్డులో ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన సంఘటన గురువారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన సద్దాం (38) తన భార్యకు విబేదాలు రావడంతో కోర్టు వద్ద గల బైపాస్‌ రోడ్డులో పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే స్థానికులు గమనించి బాధితున్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Husband’s suicide attempt