టంగుటూరు ముచ్చట్లు:
రోడ్డు ప్రమాదంలో ఎస్సై కానిస్టేబుల్ కి గాయాలు టంగుటూరు మండలం వల్లూరు సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీ అగస్మాత్తుగా బ్రేక్ వేయడంతో పోలీసు వాహనం లారీని వెనకనుంచి ఢీకొట్టింది. అదే సమయంలో మరో లారీ పోలీస్ జీప్ ని వెనకనుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో ఎస్ఐ నాగమల్లేశ్వరరావుకు తీవ్ర గాయాలు కాగా మరో కానిస్టేబుల్ కి స్వల్ప గాయాలయ్యాయి. ఒంగోలులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Tags: SI Nagamalleswara Rao Sustains Severe Injuries