September 17, 2026
Explore
సకల కళలకు ఆదిగురువు – దేవశిల్పి విశ్వకర్మ: జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు

సకల కళలకు ఆదిగురువు – దేవశిల్పి విశ్వకర్మ: జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు

September 17, 2026 | Andhra Pradesh

తిరుపతిముచ్చట్లు:

జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం దేవశిల్పి విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ., విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. విశ్వకర్మను సకల కళలకు ఆదిదేవుడిగా, వాస్తుశిల్పిగా, శిల్పకళకు ఆదిగురువుగా పరిగణిస్తారని తెలిపారు. హిందూ పురాణాల ప్రకారం నాలుగు యుగాల్లో అనేక పట్టణాలు, నిర్మాణాలను విశ్వకర్మ నిర్మించినట్లు పేర్కొన్నారు. ఆయుధాలు, పనిముట్ల ప్రాధాన్యతను తెలియజేసిన మహోన్నత వ్యక్తిగా విశ్వకర్మను భావిస్తారని అన్నారు. శాస్త్రం, చిత్రలేఖనం, శిల్పకళ, వాస్తుశాస్త్ర రంగాలకు విశ్వకర్మ అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. విశ్వకర్మ విశిష్టతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, పోలీసు కార్యాలయ సిబ్బంది, పాల్గొన్నారు.

Tags:The Primordial Teacher of All Arts – The Divine Architect Viswakarma: District SP L. Subbarayudu