20 మంది కలిసి కొట్టినట్లు సమాచారం.. విచారణకు డిమాండ్
సిరివెళ్ల ముచ్చట్లు:
మండలంలోని గోవిందపల్లె గ్రామంలో ఓ యువకుడిపై సుమారు 20 మంది కలిసి దాడి చేసినట్లు సమాచారం. స్థానికుల సమాచారం ప్రకారం, రౌడీషీటర్‌గా పేర్కొంటున్న రవిచంద్ర రెడ్డి, ఆయన అనుచర వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులు కలిసి యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓ యువకుడిపై దాడికి పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ ఘటనకు దారితీసిన కారణాలు ఏమిటి? దాడిలో ఎంతమంది పాల్గొన్నారు? యువకుడికి ఎలాంటి గాయాలయ్యాయి? అనే వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు సమగ్రంగా విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.
దాడి ఘటనపై బాధితుడి ఫిర్యాదు, పోలీసుల విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది
Tags;Youth attacked in Govindapalle