September 16, 2026
Explore
విద్యార్థులకు మహిళా, బాలల భద్రతపై శక్తి టీమ్ అవగాహన.

విద్యార్థులకు మహిళా, బాలల భద్రతపై శక్తి టీమ్ అవగాహన.

September 16, 2026 | Andhra Pradesh

  • శక్తి యాప్, మహిళా–బాలల రక్షణ హెల్ప్‌లైన్ నంబర్లపై అవగాహన.
  • గుడ్ టచ్–బ్యాడ్ టచ్‌పై విద్యార్థులకు అవగాహన.
  • బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థకు దూరంగా ఉండాలని సూచన.
  • క్రమశిక్షణ, నైతిక విలువలు, విద్యతో ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలని పిలుపు.

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల భద్రత, బాలల హక్కులు మరియు మహిళా రక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శక్తి టీమ్ ఆధ్వర్యంలో నెహ్రూ నగర్‌లోని కుమార్ ఈఎం హైస్కూల్‌లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు శక్తి యాప్, 112 అత్యవసర పోలీస్ సహాయం, 1098 చైల్డ్ హెల్ప్‌లైన్, 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ తదితర ఫిర్యాదు, సహాయ మార్గాలపై అవగాహన కల్పించారు. అలాగే గుడ్ టచ్–బ్యాడ్ టచ్, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ తదితర అంశాలపై వివరించారు. తమకు లేదా తోటి విద్యార్థులకు ఏదైనా ఇబ్బంది, వేధింపులు లేదా ప్రమాదకర పరిస్థితి ఎదురైతే భయపడకుండా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులను సంప్రదించాలని సూచించారు.

విద్యార్థులు క్రమశిక్షణతో మెలుగుతూ, నైతిక విలువలను పాటించి, చదువుపై దృష్టి సారించాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను గౌరవిస్తూ మంచి ప్రవర్తనను అలవర్చుకుని బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని శక్తి టీమ్ సూచించింది.

అత్యవసర పరిస్థితుల్లో డయల్‌-112కు, బాలల రక్షణకు 1098కు, ఆన్‌లైన్ ఆర్థిక మోసాలు లేదా సైబర్ నేరాలకు 1930కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.

Tags:’Shakti Team’ raises awareness among students about the safety of women and children.