నరసాపురం ముచ్చట్లు:
.పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సహచర మీడియా ప్రతినిధులు, వడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక ప్రైమ్ 9 న్యూస్ రిపోర్టర్ పోలిశెట్టి సత్యనారాయణ అలియాస్ చంటి గడ్డి మందు పురుగుమందు తాగి
ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చుట్టుపక్కల రైతులు గమనించి వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందించారు. సత్యనారాయణకు సీరియస్ గా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆక్వా సాగులో నష్టాలతో అప్పుల పాలైన సత్యనారాయణ.అప్పులు తీర్చినప్పటికీ, మళ్లీ కేసులు పెట్టాలని కొందరు వడ్డీ వ్యాపారులతో కలిసి సహచర మీడియా ప్రతినిధులు ఒత్తిడి చేశారన్నది కుటుంబ సభ్యుల ఆరోపణ చేస్తున్నారు అంతేకాదు. ప్రెస్‌మీట్ల కు వెళ్లిన సమయంలో అవమానాలకు గురిచేశారని, ప్రైమ్ 9 న్యూస్ రిపోర్టర్ ను పిలిస్తే తాము ప్రెస్‌మీట్లకు రామని కొందరు మీడియా ప్రతినిధులు బెదిరించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.ఈ ఘటన పై టీవీ 9 మారుతి, టీవీ 5 సందీప్, ఐ న్యూస్ రాజేష్, సాక్షి పత్రిక కేతినేడి రంగపై కేసులు నమోదు చేసి విచారణ జరిపించాలని కోరుతూ. సత్యనారాయణ భార్య, పిల్లలు, అన్న సుబ్రహ్మణ్యం నరసాపురం డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.తమ కుటుంబానికి సత్యనారాయణే ఆధారమని. ఆయనకు ఏదైనా జరిగితే కుటుంబం రోడ్డున పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని, ఆత్మహత్యాయత్నానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీని కుటుంబ సభ్యులు కోరారు..
Tags: Journalist commits suicide due to harassment by fellow journalists.